ఫలహారి మహారాజు: మానవసేవయే మాధవ సేవ
నిర్మల్: సేన బ్లడ్ గ్రూప్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు బెడ్ షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫలహారి మహారాజు ప్రయోగరాజ్ మాట్లాడుతూ, మానవసేవయే మాధవ సేవ అని, ప్రతి ఏడాది బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరువలేనిదని, కాలాతీత సేవలను భగవంతుడు ఎంతగానో ఇష్టపడతాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బాధ్యులు ఉస్మాన్ యాఫై, అజహర్ ఖాన్, ఈసా లతీఫ్, ఫర్హాన్ లు పాల్గొన్నారు.