
ఆరోగ్యంగా తిరిగిరా 'లక్ష్మి'.. భక్తుల కన్నీటి వీడ్కోలు (వీడియో)
కర్ణాటకలోని హంపిలో ఉన్న విరూపాక్ష ఆలయానికి చెందిన ఆస్థాన ఏనుగు 'లక్ష్మి' ఆరోగ్యం క్షీణించడంతో, అధికారులు దానిని చికిత్స కోసం కోలార్‌కు తరలించారు. ఈ నిర్ణయంతో స్థానికులు, భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొందరు 'ఆరోగ్యంగా తిరిగిరా లక్ష్మి' అంటూ కన్నీటితో వీడ్కోలు పలికారు. ఏనుగు కూడా భావోద్వేగానికి గురై భక్తులను ఆశీర్వదించి లారీలో తరలింపునకు సిద్ధమైంది. ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.




