పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

379చూసినవారు
పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఈనెల 28న చేపట్టే పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం భైంసా పట్టణంలోని తన నివాసంలో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో వ్యాధి రాకుండా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు డ్రాప్స్ వేయించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్