నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నుండే కాకుండా రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు భారీగా తరలిరానున్నారు. జాతరలో మొదటి రోజైన శనివారం స్వామివారి కళ్యాణాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం సల్ల కుండలు, సోమవారం రథోత్సవం, మంగళవారం నాగవెల్లి, చివరి రోజు జరిగే అగ్నిగుండంతో జాతర ముగుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.