నిర్మల్ న్యాయస్థానం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ రాథోడ్ బాబు నాయక్ అనే వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. రూరల్ ఎస్సై లింబాద్రి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, దిలావర్ పూర్ మండలం అంజనీ తండాకు చెందిన బాబు నాయక్ పోలీసుల వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డాడు. న్యాయస్థానంలో హాజరుపరచగా ఈ తీర్పు వెలువడింది. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.