జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 29 కారుణ్య నియామకాలకు సంబంధించి 20 పోస్టులను భర్తీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 జూనియర్ అసిస్టెంట్, 6 ఆఫీస్ సబార్డినేట్, 1 కామాటి పోస్టులను వివిధ శాఖలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగిలిన 9 పోస్టులు రోస్టర్ అంశాలతో ముడిపడి ఉన్నందున వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని, అన్ని నియామకాలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు.