హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో బోయివాడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీరామ భక్తుడు, అంజనీ పుత్రుడు, మహావీరుడు అయిన ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన వేడుకున్నారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జింక సూరి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.