స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా, సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మెగా రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం రక్తమార్పిడి అవసరం కాబట్టి, వారికి రక్తం దొరకడం లేదనే ఇబ్బందులను అధిగమించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.