ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన ఎంఈఓ

2చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన ఎంఈఓ
నిర్మల్ జిల్లా, ముథోల్ మండలంలోని తానూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్, ఎంఈఓ నరేందర్ బుధవారం పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్న ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమన్ బాయి,గోవింద్ రావు పటేల్, పంచాయతీ కార్యదర్శి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్