నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో కూచాడి సత్యమ్మ - ప్రకాష్ రావు కంటి పరీక్ష కేంద్రాన్ని శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నిర్మల్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు ఈ ఉచిత కంటి పరీక్ష కేంద్రం గొప్ప వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ వైద్యరంగంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వైద్య
పరీక్షలు చేయించుకుంటున్న తరుణంలో ఈ ఉచిత కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీహరి రావును ఆయన అభినందించారు.