నర్సాపూర్ (జి) మండల సర్వసభ్య సమావేశంలో గురువారం నిర్మల్ నియోజకవర్గ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కుస్లి, బురుగుపల్లి(జి), తిమ్మాపూర్(జి) గ్రామాల్లో తీవ్ర విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయని, దీనిపై పలుమార్లు విద్యుత్ అధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని సర్పంచులు ఎమ్మెల్యేకు విన్నవించారు. సమావేశానికి గైర్వాజరైన అధికారులకు నోటీసులు జారిచేయాలని ఎంపీడీవో, తాహసిల్దార్ కు ఆదేశించారు. కేజీబీవి పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఎస్ ఓ. కోరారు.