నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు గురువారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులకు కన్వర్షన్ అందజేసి, ఏపీ ఎస్పీబి రూల్స్ ను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ మ్యాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.