మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

667చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, క్వింటాలుకు రూ. 2400/- కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. దళారులకు పంటను అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్