నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోయా పంట కొనుగోలు కేంద్రాన్ని బీజీఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటల్ కు రూ. 5328 ఉందని, దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.