విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

3చూసినవారు
విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో శ్రీ మహ పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన ఏర్పాట్లను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం పరిశీలించారు. వచ్చే నెల నవంబర్ 7న ఈ ప్రతిష్టాపన జరగనుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించిన ఆయన, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ట్యాగ్స్ :