గురువారం దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.