గీతాశ్రమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శుక్రవారం సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ విద్యా ప్రకాశనందగిరి గీతాశ్రమ 43వ వార్షికోత్సవ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య, కంకేట సర్పంచ్ సాహెబ్ రావ్, సీనియర్ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ లు ప్రశాంత్, తాండ్ర సర్పంచ్ నర్సయ్య, మండల నాయకులు మధు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
