పోలియో చుక్కల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పవార్ రామారావు
నిర్మల్ జిల్లా భైంసాలోని తన నివాసంలో రేపు చేపట్టే పోలియో చుక్కల ప్రచార పోస్టర్‌ను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో తల్లిదండ్రులు బాధ్యతగా పాల్గొని చిన్నారులకు డ్రాప్స్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల కార్యదర్శి, చింతల్‌బోరి సర్పంచ్ పండిత్ రావ్ పటేల్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.