బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

0చూసినవారు
బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా, నర్సాపూర్ (జి) మండలం గొల్లమడ గ్రామంలో బీరప్ప స్వామి మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బుధవారం భూమిపూజ చేశారు. కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్యేను సత్కరించి, గొంగడి కప్పి, గొర్రెపిల్లను బహుకరించారు. రూ. 5 లక్షలు గ్రామస్తుల నుంచి, రూ. 20 లక్షలు సిజిఎఫ్ నిధుల ద్వారా ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్