నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం, నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, సోన్, మామడ, దిలావార్పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాలకు చెందిన 90 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు.