బాధితుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

4చూసినవారు
నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని ఝరి(బి), ఎల్వి గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో పలువురు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆయా గ్రామాలను సోమవారం సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్