నిర్మల్ సారంగాపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన అడెల్లి మాహ పోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం, ఆలయ పరిసరాలు, విగ్రహ పునఃప్రతిష్టాపన, శత చండీయాగ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నవంబర్ 7న విగ్రహ పునఃప్రతిష్టాపన జరుగుతుందని, నవంబర్ 3 నుంచి 7 వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.