నిర్మల్ లో కోతుల దాడులు: స్వీయ రక్షణకు కర్రతో తిరుగుతున్న శేఖ్ అహ్మద్
నిర్మల్ లో కోతుల దాడులు ఎప్పుడు జరుగుతాయో, ఎవరిని గాయపరుస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, నిర్మల్ నివాసి శేఖ్ అహ్మద్ తన వాహనానికి కర్ర పెట్టుకొని తిరుగుతున్నారు. జంతువులు, పిల్లలపై కోతులు, కుక్కలు దాడులు చేస్తున్నప్పుడు తన కర్రతో కాపాడానని ఆయన తెలిపారు. నిర్మల్ లో కోతులు, కుక్కల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.