ఖానాపూర్ లో కోతుల బెడద: పట్టణ వాసుల ఆందోళన
ఖానాపూర్ పట్టణంలో కోతుల బెడద తీవ్రమైంది. స్థానికులు మంగళవారం ఏకమై ప్రత్యేక బ్యానర్లతో ర్యాలీ నిర్వహించి, నినాదాలు చేశారు. పిల్లలు, పెద్దలపై దాడులు చేస్తున్న కోతులను అరికట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని పట్టణ వాసులు హెచ్చరించారు.