నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఎంపీడీఓ గజ్జరాం పరిశీలించారు. రెండో విడత నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన వారికే నామినేషన్ వేసేందుకు అనుమతించాలని అధికారులకు సూచించారు.