పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించిన ముదిరాజ్ సంఘ నాయకులు

1చూసినవారు
పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించిన ముదిరాజ్ సంఘ నాయకులు
నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్టించాలని, వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యాటకారి సాయన్న, పాతర్ల గణేష్, సుంకరి సాయి, సుంకరి రాజేష్, అర్జున్, సుంకరి చరణ్, ఆనంద్, సోలాపూర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :