కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావును డీసీసీ ప్రధాన కార్యదర్శి, నిర్మల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి, కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన రవిని అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదరి అరవింద్, గంగోని భూరజ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.