ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం

0చూసినవారు
శుక్రవారంతో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజున నిర్మల్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు. నిర్మల్ మున్సిపాలిటీలో 320, బైంసాలో 202, ఖానాపూర్లో 113 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజున కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కోలాహలం నెలకొంది.

సంబంధిత పోస్ట్