నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ లోని పోచమ్మ అమ్మవారికి ఆదివారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, పిల్ల పాపలను చల్లగా చూడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.