ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలని, వ్యాధి గ్రస్థులకు సత్వర చికిత్స అందించాలని తెలిపారు.