సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు
నిర్మల్ జిల్లా బాసరలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సరస్వతి అమ్మవారిని గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలమ, మున్నూరు కాపు యువకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బైంసా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆల్జాపూర్ సుధాకర్ రావు, నక్షత్ర లాడ్జ్ యాజమాన్యం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముమ్మాయి రమేష్ ను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కారేగాం సాయిందర్ రావు, మమ్మాయి సచిన్, ఎన్ఎస్యూఐ కార్యదర్శి గంగా ప్రసాద్, వ్యాపారవేత్తలు నానం నర్సయ్య, ఎర్రం రాజు, ఆకుల చరణ్, చాకలి అశోక్, గురప్ప శంకర్ తదితరులు పాల్గొన్నారు.