నర్సాపూర్: సాగు పంటల వివరాలను డిజిటల్ నమోదు చేసుకోవాలి
సాగు చేసే ప్రతి ఒక్క రైతు తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని ఏవో రమ్య అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండలంలోని నందన్ గ్రామంలో డిజిటల్ పంట నమోదు కార్యక్రమం చేపట్టారు. రైతులు సాగు చేసే పంట వివరాలను సర్వే నంబర్ ఆధారంగా నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పంట వివరాలను నమోదు చేయడం ద్వారా పంటను మార్కెట్లో విక్రయించడానికి వీలుగా ఉంటుందని ఆమె తెలిపారు.