తానూర్ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

1359చూసినవారు
తానూర్ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ నరేష్‌ను కళాశాల సిబ్బంది, విద్యార్థులు శాలువాతో సన్మానించారు. సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ప్రిన్సిపాల్ రవి కిరణ్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ లక్ష్మణ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్