జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారి సంస్థ అధికారులతో నిర్వహించిన సమావేశంలో, రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని, లైటింగ్, సూచికల బోర్డులు, జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడం అధికారుల బాధ్యత అని తెలిపారు.