బాసర ఆలయంలో నవరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోందని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. సాంప్రదాయకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కాలాక్షేప మండపాన్ని తొలగించడం వల్ల కళాకారులకు వేదిక అందుబాటులో లేదన్నారు. ఈ నెల 11 నుండి 20 వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని, భక్తులు సహకరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.