నిర్మల్ జిల్లా బీజేపీలో నూతన నియామకాలు, నేతలకు ఘన సన్మానం

0చూసినవారు
నిర్మల్ జిల్లా బీజేపీలో నూతన నియామకాలు, నేతలకు ఘన సన్మానం
నిర్మల్ జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, బీజేవైఎం విభాగాల్లో పలువురు కీలక పదవుల్లో నియమితులయ్యారు. దేవునే శంకర్, సుద్ద సాయిబాబా, జాదవ్ గణేష్, లుకనే శివానంద్, యోగేష్ లు వివిధ పదవులను చేపట్టారు. బాసర మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా బాలాపురం మనోహర్, ఉపాధ్యక్షుడిగా జలంధర్, కొండాపురం గంగాధర్, సీహెచ్ సాయినాథ్ లు మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ ల ఆధ్వర్యంలో నూతనంగా పదవులు పొందిన నాయకులను అభినందించి, సన్మానించారు.

సంబంధిత పోస్ట్