నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆయన సతీమణి ఇలా త్రిపాఠి ఆదివారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు.