నిర్మల్ జిల్లా, ముథోల్ మండల పరిధిలోని వడ్గావ్ గ్రామంలో బుధవారం నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కదం సుమన్ బాయి - గోవింద్ రావు పటేల్ మాట్లాడుతూ, గ్రామంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కావడం పట్ల గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన కరేంట్ ఏఈ, జెఎల్ఎం లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎల్ఎం తిరుపతి, వివిధ వార్డుల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.