బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ సర్పంచ్ రాచకొండ సాగర్ గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచ్ విన్నవించగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.