కలెక్టరేట్ ఎదుట న్యూ వెల్మల్ గ్రామ రైతుల ఆందోళన

1చూసినవారు
కలెక్టరేట్ ఎదుట న్యూ వెల్మల్ గ్రామ రైతుల ఆందోళన
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. గత నెల రోజుల క్రితం గ్రామంలో ఎఫ్ఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం కేంద్రంలోనే ఉండిపోయిందని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈదురుగాలులతో అకాల వర్షం కురుస్తున్న నేపథ్యంలో వెంటనే ధాన్యాన్ని గోదాములకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్