నిర్మల్ జిల్లా కేంద్రంలోని కళా నగర్ లో గల శ్రీ మాత నిమిషాంబ దేవి ఆలయంలో ఆదివారం నకాష్ కులస్తుల ఆరాధ్య దైవమైన నిమిషాంబ దేవి జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. నకాష్ కులస్తులు నిమిషాంబ దేవికి ప్రత్యేక పూజలు చేసి, మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.