బోథ్ సీఐ గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని పోచెర గ్రామానికి చెందిన యువకుడిని మోసం చేసి, నిర్మల్ జిల్లాకు చెందిన పాలంకర్ గంగాధర్ అనే వ్యక్తి రూ.20 వేలు వసూలు చేశాడు. అనంతరం నకిలీ నియామక పత్రం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ విచారణలో ఎస్ఐ పురుషోత్తం పాల్గొన్నారు.