హిందువులపై జరుగుతున్న దాడులు, డాక్టర్ సంతోష్ రాజుపై దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ నిర్మల్ పట్టణంలో బీజేపీ నాయకులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, దుకాణ యజమానులు, ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. హిందువులపై దాడులు పునరావృతమైతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించిన నాయకులు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు.