నిర్మల్: జాతీయ రహదారిపై పశువుల సంచారం

51చూసినవారు
నిర్మల్-బైంసా 61వ జాతీయ రహదారిపై ప్రతిరోజు వేలాది వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ రహదారికి ఆనుకున్న పలు గ్రామాల రైతులు తమ పశువులను మేత కోసం రోడ్డు పరిసరాల్లోనే వదిలేస్తున్నారు. దీంతో అవి ఒకేసారి రోడ్డుపైకి వచ్చేస్తాయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భారీ, సాధారణ వాహనాలు నడిచే ఈ రహదారిపై పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్