జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాం వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని, అలాగే పటిష్ఠ అగ్నిమాపక వ్యవస్థను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.