నిర్మల్: 9న జరిగే సార్వత్రిక సమ్మెకు సీపీఎం మద్దతు
జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతు తెలుపుతుందని రాష్ట్ర నాయకులు ఉడుత రవీందర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి నిర్మల్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని ఈ ఆందోళన చేపడుతున్నామన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ వామపక్ష పార్టీలని ఏకమవుతున్నారన్నారు.