రైతులకు ప్రభుత్వ సోయా కొనుగోళ్లకు సంబంధించిన టోకెన్లను నేటి నుంచి అందజేస్తారని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. రైతులు తమ పట్టాపాస్ బుక్, రైతు బంధు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డుతో PACS కేంద్రాలకు వెళ్లి టోకెన్లు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు.