జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లా మరోసారి తన ఖ్యాతిని చాటుకుంది. జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి. కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి కర్రల పెంపకం కోసం ఏర్పాటు చేసిన పొనికి వనానికి గాను ఒక అవార్డు దక్కగా, అమ్మరక్షిత అనే వినూత్న కార్యక్రమం ద్వారా మాతృత్వ మరణాలను తగ్గించినందుకు మరో అవార్డు లభించింది. కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ అవార్డులను స్వీకరించారు.