రాష్ట్రంలోనే మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మే 31 నాటికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని అధిగమించి, మే 30 నాటికే రికార్డు స్థాయిలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధరతో రైతులు భారీగా తరలివచ్చారు.