నిర్మల్ చేపల మార్కెట్ దుర్గంధంతో రోగులకు నిలయం
నిర్మల్ పట్టణంలోని ప్రధాన చేపల మార్కెట్ దుర్గంధంతో నిండిపోయింది. గత ప్రభుత్వ హయాంలో లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ మార్కెట్ లో సరైన సౌకర్యాలు లేవు. మురికి నీరు ప్రధాన ద్వారం వద్ద నిలిచిపోతోంది. నెలల తరబడి పారిశుద్ధ్య పనులు జరగకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురదలోనే క్రయవిక్రయాలు చేసుకోవాల్సి వస్తోందని వారు వాపోయారు.